విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
వెల్దండ, జులై 3 (మనఊరు ప్రతినిధి): ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (బాలికల) పాఠశాల విద్యార్థులకు ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ల్యాప్టాప్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న డిజిటల్ ప్రపంచంతో పోటీగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా సన్నద్ధం కావాలని,వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించి,వారిలోని ప్రతిభను ప్రోత్సహించి,వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాడానికి తన వంతు ప్రయత్నంగా ల్యాప్టాప్ లను అందజేస్తున్నాని, డిజిటల్ యుగంలో విద్యార్థులు మరింత సమగ్రమైన,మెరుగైన విద్యను పొందడానికి డిజిటల్& కంప్యూటర్ తరగతులు సహాయపడుతాయని, విద్యార్థులు కంప్యూటర్ కోడింగ్ లాంటి తదితర కొత్త విషయాలపై పాఠశాల దశలోనే అవగాహన కల్పించాలని,కార్పొరేట్ విద్యాలయాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు సాగాలని తదనుగుణంగా తన వంతు సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేశారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో కూడా రాణించాలని, అందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మా పాఠశాలకు ఎలాంటి సహాయం అడిగిన వెంటనే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్పందించి, సహాయ సహకారాలు అందిస్తున్నారని, గతంలో విద్యార్తులకు వాష్ రూమ్స్ విషయంపై స్పందించి వెంటనే ఒక లక్ష రూపాయలతో వాటికి మరమత్తులు చేయించారని, అలాగే ఈరోజు మా విద్యార్థులు అడిగిన వెంటనే ఉచితంగా ల్యాప్టాప్ లను అందించి అన్ని విధాలుగా మా పాఠశాలను సహాయ,సహకారాలు అందిస్తూ మా విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని, వారికి మా పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ స్వర్ణ రత్నం, ఉపాధ్యాయులు మురళితో పాటు సీనియర్ నాయకులు దశరథ్ నాయక్, లాలూ నాయక్, నర్సింగ్, రమేష్, రఘు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు కొండల్ యాదవ్, రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.