*విద్యార్థులతో కలిసి సహ పంక్తి భోజనం చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
మైదుకూరు, జూలై 3 (మనఊరు ప్రతినిధి): బి.మఠం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల (బాలురు) తరగతి గదుల ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీఈజి అశోక్ కుమార్, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ లు సహపంక్తి భోజనం చేస్తూ విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. గురుకుల పాఠశాలలో సరైన సమయానికి టిఫిన్, భోజనం అందజేస్తున్నారా? రుచిగా అందిస్తున్నారా? వారానికి రెండుసార్లు ఇచ్చే చికెన్ తగినంతగా ఇస్తున్నారా లేదా? వసతి గృహంలో బెడ్ షీట్స్ అందించారా లేదా అనే విద్యార్థులను కలెక్టర్ అడగగా విద్యార్థులు మేము అడిగినంతా అన్నం పెడతారని, కూరలు రుచికరంగా ఉంటాయని, బెడ్ షీట్స్ అందించారని ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు.
*వీరేష్ అనే విద్యార్థి కలెక్టర్ తో మాట్లాడుతూ.*
మాది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కృష్ణాపురం గ్రామమని మా తల్లిదండ్రులు ఇటుక పనికి వెళ్తారని, తాను 9వ తరగతి చదువు తున్నానని, పెద్దయ్యాక మాథ్స్ టీచర్ అవుతానని కలెక్టర్ కి తెలుపగా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేస్తూ బాగా చదువుకొని నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఓ ఉదయశ్రీ, డిఇఓ శంషుద్దీన్, ఏపీసి నిత్యానంద రాజు, పిడి ఆదిశేషారెడ్డి, ఆర్డిఓ చంద్రమోహన్,ఎంపీపీ వీర నారాయణరెడ్డి, మండల తెదేపా అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి, తహసిల్దార్ రాజసింహనరేంద్ర, ఎంపీడీవో వీరకిషోర్, కానాల మల్లికార్జునరెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, సాంబశివారెడ్డి , పూజా శివ, ఈశ్వర్ రెడ్డితో సహా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.