త్యాగాలకు ప్రతీక ఈ పీర్ల పండుగ

 *త్యాగాలకు ప్రతీక ఈ పీర్ల పండుగ* 

 *మాదారంలో ఘనంగా పీర్ల ఊరేగింపు.* 

 *కుల మతాలకు అతీతంగా హాజరవుతున్న ప్రజలు* 

 *భారీ బందోబస్తు నిర్వహించిన పోలీసులు* 


ఊరుకొండ, జులై 6 (మనఊరు ప్రతినిధి): త్యాగానికి ప్రతీక మొహర్రం అని ఊరుకొండ ఎస్సై కృష్ణదేవ్ అన్నారు. ఆదివారం మొహర్రం సందర్భంగా మండలంలోని మాదారం గ్రామంలో పీర్లకు దట్టీలు కట్టారు. పిన్నంశెట్టి సైదులు, ఎక్క బంగారు, బెల్లం పర్వతాలు, పీర్ల కమిటీ ముతా వలి షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో హజ్రత్ హిమాం హుస్సేన్, హిమాం కాసిం పీర్లను దర్శించుకున్న ఊరుకొండ ఎస్సై కృష్ణదేవ్ దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రభుత్వం అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇస్తున్నదని అన్నారు.

 కులమతాలకు అతీతంగా నిర్వహించే మొహరం పండుగ ఇస్లామిక్ నూతన సంవత్సరంలోని మొదటి నెలలో ఈ పండుగను జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు నిలబెట్టిన పీర్లను మతసామరస్యాలకు అతీతంగా ప్రజలంతా ఏకమై ఘనంగా నిర్వహించుకునే పీర్ల ఊరేగింపును మసీదులలో మధ్యాహ్నం నుంచి ఒక్కో పీర్ ఊరేగింపుగా బయలుదేరడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కలిసిమెలిసి నిర్వహించుకుంటున్న ప్రజలు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. మసీదులో పీర్ల చావిడిలా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఇస్లాం ధర్మ ప్రవచనాలు మహమ్మద్ ప్రవక్త బోధనలను వివరించారు. మొహరం మానవ విలువలు, న్యాయం, ధర్మ కోసం నిలబడటం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం వంటి సందేశాలను ఇస్తుందని హుస్సేన్ త్యాగం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నది వారు పేర్కొన్నారు. ఊరుకొండ ఎస్సై కృష్ణదేవ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post