ఘనంగా మొహర్రం వేడుకలు

 ఘనంగా మొహర్రం వేడుకలు 


జడ్చర్ల రూరల్, జులై 6 (మనఊరు ప్రతినిధి): మొహర్రం పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం లాగానే మహ్మద్ షఫీ అలీ చిష్తి ఆధ్వర్యంలో మిరాపూర్ లోని ఆస్థానలో జరిగిన మొహర్రం త్యాగం స్ఫూర్తి గుర్తు చేసుకుంటు హస్సేన్, హుస్సేన్ ల వారి ఇస్లాం సందేశాలు స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహ్మద్ షఫీ అలీ చిస్తీ తన సందేశాన్ని ప్రజలకు అందించారు, మానవ జీవితంలో దైవం ప్రార్ధనలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు. కలిమి మీరాపూర్లో హజరత్ హుస్సేన్ హజరత్ హసేన్ ని తల్చుకుంటూ వారి యొక్క ఇస్లాం సందేశాలను విస్మరించుకుంటూ గ్రామ పెద్దలు మరియు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు కూర్చొని మతసామరస్యంతో ధనికా పేద కులమతాలకు అతీతంగా అందరూ కూర్చొని హజరత్ హుస్సేన్ హజరత్ హసేన్ రజియల్లాహు తలా అన్హ యొక్క ఇరుముర్షిద్ షా దర్వేష్ అల్లామా మహమ్మద్ అలీ చిష్టి కలిమి వీరాపూర గారు దైవ సందేశాన్ని, ముఖ్య ప్రార్ధన కూడా వినిపించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మత పెద్దలు గ్రామ పెద్దలు మరియు అధిక సంఖ్యలో ఆ గ్రామ ప్రజలందరూ పాల్గొని దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు అంజద్ అలీ ఖాద్రి మహమ్మద్ అహ్మద్ అలీ ఖాద్రి ,,,,, ఇద్దరూ కలిసి గ్రామ ప్రజలకు మరియు ఖాన్ కాయ కలిమి లో విచ్చేసినటువంటి అతిథులకు సహృదయ పూర్వక స్వాగతాలు పలుకుతూ ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజద్ అలీ ఖాద్రీ, అహ్మద్ అలీ ఖాద్రీ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. 

Previous Post Next Post