డిగ్రీ కళాశాలలో ఘనంగా ఆషాడ మాస గోరింటాకు పండగ
కల్వకుర్తి, జులై 17 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ఎం జూనియర్, డిగ్రీ కళాశాలలో విద్యార్థినులందరూ, అధ్యాపక బృందంతో కలిసి ఆషాఢమాస గోరింటాకు పండగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ మేకల రాజేందర్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన సాంప్రదాయం అలాగే దీని వెనుక ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయని తెలిపారు. గోరింటాకు చర్మాన్ని చల్లబరచడానికి సహాయపడుతుందని,
గోరింటాకులో ఉండే ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి అని తెలిపారు. ఆషాడ మాసంలో మహిళల ఆరోగ్యాన్ని కాపాడడానికి సాంప్రదాయ బద్ధంగా వస్తున్న ఆచారం గోరింటాకు పెట్టుకోవడం. మనకు అందరికి తెలుసు గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఇంటి పని వంట పని చేస్తున్నప్పుడు ప్రతినిత్యం నీ చేతిలో నీళ్లలో నానుచుంటాయి కాబట్టి అదే విధంగా పొలం పనులు చేసిన కూడా నీటిలో నాన్తాయి కాబట్టి వర్షాకాలంలో మరింత చేతిలో నాని వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన ప్రభావం పడుతుందని గ్రహించి ఆయుర్వేద విలువలు కలిగిన గోరింటాకును చేతులకు వెళితే దానివల్ల చేతులు అనారోగ్య బారిన పడకుండా ఉంటాయని తెలిసి మహిళలు గోరింటాకు పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క సంప్రదాయం కూడ ఏదో ఒక సైన్స్ తో ముడిపడిఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సదానందంగౌడ్, అధ్యాపకులు ప్రవల్లిక, సంధ్యారాణి, యాదయ్య, నవీన్, బాలరాజు, రామ కృష్ణ, ప్రభాకర్, ఈదమయ్య, శ్రీశైలం, వెంకటయ్య, శరత్, తదితరులు పాల్గొన్నారు.