పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి
పాఠశాల హెచ్ఎం నెహమ్యా
పాఠశాలకు చార్జబుల్, వైర్లెస్ మౌత్ పీస్ స్పీకర్ అందజేత *
మిడ్జిల్, జూలై 19 (మనఊరు ప్రతినిధి): పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతీ ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని పాఠశాల హెచ్ఎం నెహమ్యా అన్నారు. శనివారం వెలుగొమ్ముల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన కీర్తిశేషులు ఎన్నం నారాయణ గుప్తా జ్ఞాపకార్థంగా ఆయన కుమారులు ఎన్నం మోహన్ బాబు లావణ్య, ఎన్నం మహేష్ కుమార్కళ్యాణిల ఆద్వర్యంలో చిన్న కుమారుడు కోడలు రాఘవేందర్ తులసీలు వారి చిన్న కుమార్తె కీర్తన 7వ జన్మదినం సందర్భంగా చార్జబుల్, వైర్లెస్ మౌత్ పీస్ స్పీకర్ ను. అలాగే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులు , గ్రామస్తుల సమక్షంలో కీర్తన జన్మదిన వేడుకలు జరిగాయి. విద్యార్థులకు పెన్నులు ఏర్పాటు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం నెహమ్యా, ఉపాధ్యాయులు రమేష్, విజయ్ కుమార్, రేవతి, గ్రామ నాయకులు మాట్లాడుతూ మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షిం చాలన్నారు. ఏన్నం నారాయణ గుప్తా జ్ఞాపకార్థంగా పాఠశాలకు వైర్లెస్ స్పీకర్ ను అందజేయడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. అన్నం నారాయణ గుప్త కుమారులను స్పూర్తిగా తీసుకొని గ్రామంలోని అందరూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఈఓ రంగారెడ్డి, సత్యం గుప్తా, మధునాకర్ రెడ్డి, మాధవరెడ్డి, లక్ష్మారెడ్డి, గడ్డం కృష్ణయ్య, దత్తాత్రేయులు, భీర్ల సత్యనారాయణ, సత్యనారాయణ గౌడ్, సాయిబాబు, జరిగింది