ఉపాధ్యాయ ఉద్యోగులకు బదిలీలతో కూడిన పదోన్నతులను చేపట్టండి

 *ఉపాధ్యాయ ఉద్యోగులకు బదిలీలతో కూడిన పదోన్నతులను చేపట్టండి:*

ఎస్.టి. యూ.



నాగర్ కర్నూలు, జూలై 7 (మనఊరు ప్రతినిధి): మండలంలో పలు పాఠశాల లో స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్ టి యు)సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ ,రాష్ట్ర కార్యదర్శి కె.రమేష్, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్.మురళితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుమ్మెర లో వారు మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్ నుండి ప్రధానోపాధ్యాయులకు,ఎస్జీటీ నుండి స్కూల్ అసిస్టెంట్ లకు బదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బదిలీలు చేయకుండా పదోన్నతులు కల్పిస్తే సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోతారని తెలిపారు. ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు చెల్లించాలని కోరారు. గత ఎనిమిది నెలల క్రితం సమగ్ర సర్వే చేసిన ఉపాధ్యాయులకు వెంటనే పారితోషకం చెల్లించాలని జిల్లా అధికారులను కోరినారు . నేడు నాగర్ కర్నూలు, ఉయ్యాల వాడ , కుమ్మెర, శ్రీపురం , తూడుకుర్తి గ్రామాలలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కరుణాకర్ రెడ్డి నాగర్ కర్నూల్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్.మధుసూదన్ రెడ్డి, పి. బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post