అంగరంగ వైభవంగా స్వామి వారి గరుడ సేవ

 వట్టెం వెంకన్న గరుడ వాహన సేవ

*వట్టెం శ్రీ వెంకటాద్రి కొండపై కొలువుతీరినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం*




బిజినపల్లి, జూలై 29 (మనఊరు ప్రతినిధి): గరుడ పంచమి సందర్భంగా ఉదయం 10 గంటలకు *శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి గరుడ వాహన సేవ* నిర్వహించడం జరిగింది దేవస్థాన వ్యవస్థాపక సభ్యులు సందడి ప్రతాప్ రెడ్డి దంపతులు స్వామివారికి హారతి పట్టారు

దీన జనుల వద్దకు స్వామి వారు:

ఇందులో భాగంగ మొదటి సారి స్వామి వారి గరుడ సేవ, ఉత్సవ మూర్తుల అంగరంగ వైభవంగా ఉత్సవమూర్తులను అలంకరించి భజన మేళ తాళాలతో స్వామివారి, ఊరేగింపు నూతనంగా నిర్మితమైన వెంకటాద్రి నగర్ (అనఖాన్ పల్లి, కారుకొండ తాండ, అనేఖాన్ పల్లె తండ) పురవీధుల గుండా స్వామివారి పల్లకి సేవ రంగ రంగ వైభవంగా నిర్వహించారు 

 స్వామి వారి సేవా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, ఆలయ పండితులు ప్రసాద్ స్వామి భక్తులకు తీర్థ ప్రసాదములను అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది వివిధ గ్రామాలతో వచ్చిన భక్తులు తాండ ప్రజలు. అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Previous Post Next Post