అంటువ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

 అంటువ్యాధులు నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి 

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ కె.వి స్వరాజ్యలక్ష్మి 




బిజినెపల్లి, జూలై 29 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలోని పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా మంగళవారం  నాడు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె.వి స్వరాజ్ లక్ష్మి  తనిఖీ చేసి, అంటువ్యాధుల నివారణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యాధికారికి, పర్యవేక్షణ సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల వివరాలను, ఈ సీజన్లో ఏ సమస్యలతో వస్తున్నారని అడిగారు. తదనంతరం హాజరు పట్టికను, గర్భవతుల పరీక్షల, మందుల నిలువ, ల్యాబ్లో నిర్వహించే పరీక్షల రికార్డులను తనిఖీ చేశారు రికార్డులను పరిశీలించారు. మందుల నిల్వ గదిని, ల్యాబ్ ను తనిఖీ చేశారు. గ్రామాలలో క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి పాఠశాలల్లో, స్వయం సహాయక బృందాల సమావేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యాధికారికి సూచించారు. జ్వరం కేసులు ఎక్కువగా నమోదైన గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేయాలని, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. పంచాయతీ సెక్రెటరీ సహకారంతో దోమల పెరుగుదలను అరికట్టాలని, గ్రామాలలో నీరు నిలవకుండా చేయాలని, అవసరమైన చోట ఆయిల్ బాల్స్ వేయాలని సూచించారు. దోమలు పెరగకుండా ప్రతి శుక్రవారం డ్రై డే(పొడి దినం) నిర్వహించాలని, గ్రామాలలో ఇతర శాఖల సహకారం తీసుకోవాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీకాకరణ అధికారి డాక్టర్ రవికుమార్, వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, డిపిఓ రేనయ్య, ఎం పి హెచ్ ఇ ఓ రాజేష్, హెడ్ నర్స్ ఎల్సి దాయా, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Previous Post Next Post