మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ఖమ్మం, జులై 15 (మనఊరు ప్రతినిధి): మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా ఎదగాలని రీజనల్ కోఆర్డినేటర్ అంబేద్కర్, స్టేట్ కోఆర్డినేటర్ శిరీషలు అన్నారు. మంగళవారం రఘునాథపాలెం కోసం భోస్కో సేవకేంద్ర హైదరాబాద్ వారి సహకారంతో మాస్ సంస్థ ఆధ్వర్యములో 100.మంది మహిళలు యూనిట్ గా ఉంటూ మహిళా సాధి కారత ఆరోగ్యం పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో భోస్కో సేవకేంద్ర రీజనల్ కోఆర్డినేటర్. అంబేద్కర్, స్టేట్ కోఆర్డినేటర్ శిరీషలు ఉన్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందున్నప్పటికీ చాలా అభివృద్ధి పదంలో కొనసాగుతున్నారని వివరించారు. మహిళలు చేపడుతున్న పొదుపుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. మహిళలు అన్నిరంగాలలో ముందుండాలని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూల స్తంభాలంటివారని. మహిళలు అన్నిరంగా రాణిస్తున్నారని, గృహిణిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలను సమర్థంగా చేస్తారు. మాస్ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్. లక్ష్మికాంతమ్మ మాట్లాడుతూ మహిళలు ప్రశ్నించే తత్వం అలవర్చుకున్నప్పుడే సమాజంలో గౌరవాన్ని పొందుతున్నారు. ప్రభుత్వం అందించే తోడ్పాటును మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని. మహిళలు ఎవరికి వారు స్వతహాగా వ్యాపారాలు చేయగలిగినప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుంది. అమ్మ చదువు కుంటే ఆ కుటుంబములో అందరు చదువుతారని చెప్పారు. మహిళలు లేకుంటే సమాజములో ఏపని జరగదన్నారు. మహిళలు ఐక్యంగా ఉండి మహిళలపైన జరిగే అత్యాచారాలు అరికట్టినట్లు తెలిపారు. సమాజములో స్త్రీ ని. గౌర వించాలని నాయకత్వ విలువలు గురించి చైతన్య గీతాల ద్వారా వారిని ఉత్తేజపరిచారు. చివరిగా క్రాంతి క్లాస్టర్. సింధు వారి. పొదుపు వివరాలు తెలియచేశారు మందార క్లాస్టర్. ధనమ్మ వారిపోడుపు. వివరాలు తెలియచేశారు. ఆదర్శ క్లాస్టర్ మణి. వారి పొదుపు వివరాలు తెలిపారు. చివరిగా సిరి క్లాస్టర్ రమాదేవి వారి పొదుపు వివరాలు తెలియజేసారు. కార్యక్రమంలో మహిళలు వారి సంతోషాన్ని చైతన్య గీతాలు పాడుతూ. ఆడుతూ చాలా ఆనందముగా వారి సంతోషాన్ని ఆట పాటల ద్వారా నినాదాల ద్వారా. మహిళల సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమాల ద్వారా గ్రామాలు అభివృద్ధి అవుతాయి. చివరిగా స్వరూప మాట్లాడుతూ. అందరికి ధన్యవాదములు తెలియచేసినారు మహిళలు ఈ జగతికి జ్యోతుల అనే గీతముతో. కార్యక్రమం ముగింపు. జరిగినది