నీటి స్లంప్ లో పడి యువకుడి దుర్మరణం

 నీటి స్లంప్ లో పడి యువకుడి దుర్మరణం 

నవాబుపేట, జూలై 13 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని సత్రోనిపల్లి తండాకు సమీపంలోని వ్యవసాయ పొలంలో ఉన్న నీటి స్లంప్ లో ఆదివారం కాట్రావత్ బాలు నాయక్ (19 ) అనే యువకుడు ప్రమాదవశాత్తు కాలు జారిపడి దుర్మరణం పాలయ్యాడు. మండల పరిధిలోని కేశవరావుపల్లి గ్రామ సమీపంలోని దమము బండ తండాకు చెందిన బాలు నాయక్ తన అమ్మమ్మ గారి గ్రామమైన సత్రోనిపల్లి తండాలో గత రెండు సంవత్సరాలుగా నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. నీటి కోసం స్లంప్ లోకి దిగిన బాలు నాయక్ ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు అందులోనే మునిగిపోయి మృతి చెందాడు. మృతుడి తండ్రి భీమ్లా నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.

Previous Post Next Post