ఉపాధ్యాయులకు బదిలీలతో కూడిన పదోన్నతులను వెంటనే చేపట్టండి

*ఉపాధ్యాయులకు బదిలీలతో కూడిన పదోన్నతులను వెంటనే చేపట్టండి:*

ఎస్.టి. యూ రాష్ట్ర కార్యదర్శి కె.రమేష్









బిజినపల్లి, జూలై 19 (మనఊరు ప్రతినిధి): నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో పలు పాఠశాలల్లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తెలంగాణ (STUTS )సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యదర్శి కె.రమేష్, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్.మురళితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంది వడ్డేమాన్ లో వారు మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్ నుండి ప్రధానోపాధ్యాయులకు,

ఎస్జీటీ నుండి స్కూల్ అసిస్టెంట్ లకు బదిలీలతో కూడిన పదోన్నతులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలిపిన పెండింగ్ డి.ఏ.ల చెల్లింపులు, పిఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు నిర్ణయం అమలు పరచాలని కోరారు. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు,జీ.పి.ఎఫ్. పార్ట్ ఫైనల్ పేమెంట్,రిటైర్డ్ ఉపాధ్యాయుల జి.పి.ఎఫ్ ఫైనల్ పేమెంట్స్ వెంటనే చెల్లించాలని కోరారు. 2023 సంవత్సరంలో పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్లో పాల్గొన్న ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు ఈ రోజు వరకు రెమ్యునరేషన్ ఇవ్వలేదనీ, వారికి వెంటనే చెల్లించాలని కోరారు. బిజినపల్లి మండలంలోని నంది వడ్డేమాన్, అల్లిపూర్, శాయిని పల్లి, మహదేవన్ పేట్, వెలుగొండ,పాలెం, సుబ్బయ్య కాలనీ గ్రామాలలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకటస్వామి,బిజినపల్లి మండల అధ్యక్షులు శేఖర్, నాగర్ కర్నూల్ మండల అధ్యక్షులు ఎస్. మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post