గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలో
డాక్టర్ పట్ట పొందిన ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్
వనపర్తి, ఆగస్టు 16 (మనఊరు ప్రతినిధి): గ్లోబల్ అక్రిడేషన్ యునైటెడ్ నేషన్..నేషనల్ పీస్ యూనివర్సిటీ వారిచే అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ పాండిచ్చేరిలో డాక్టర్ రేట్ పట్ట పొందారు25 సంవత్సరాలుగా వనపర్తి జిల్లా ప్రజల సమాజ సేవకు, ప్రజా సమస్యలపై 18 ఏళ్లపాటు రాజీలేని పోరాటానికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కిందని సతీష్ తెలిపారు వనపర్తి కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ కౌన్సిలర్,గా సేవలు వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన కౌన్సిలర్ గా ఉన్నప్పుడు ఇంకుడు గుంతలు తవ్వించడం, హరితహారంలో ఒకేసారి మూడు వేల చెట్లు నాటడం ప్లాస్టిక్ వ్యతిరేకంగా బట్ట సంచులు ఉచితంగా ప్రజలకు పంచడం. కరోనా సమయంలో పోలీసు శాఖకు, మున్సిపల్ కార్మికులకు అన్నదానం చేయడం కార్మికులకు నిత్యావసర సరుకులు పంచడం ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ ఆస్తులు రక్షించడం ప్రజా సమస్యలపై పోరాడడం అనేక సేవ లకు గురించి డాక్టరేట్ ఇచ్చారని చెప్పారు. శనివారం పాండిచ్చేరి రాష్ట్రంలో గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలోజరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు పట్టా అందజేశారు.
డాక్టరేట్ అందుకున్న సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించి సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం గర్వంగా ఉందని, శ్రీ కృష్ణాష్టమి రోజున పట్ట అందుకోవడం అదృష్టం గా ఉందని అన్నారు. గౌరవానికి దోహదపడిన వనపర్తి పట్టణ, జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని రాబోవు కాలంలో వనపర్తి జిల్లా ప్రజలకు మరింత సేవ చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.