కిష్టారం పోలేపల్లి గ్రామాల మధ్య గల రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు
జడ్చర్ల రూరల్, ఆగస్టు 17 (మనఊరు ప్రతినిధి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పోలేపల్లి చెరువు అలుగు పారడంతో పోలేపల్లి-కిష్టారం మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రోడ్డుపై నుంచి భారీగా వరద నీరు పారడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. పోలేపల్లి పారిశ్రామిక సెజ్ లో పనిచేసే కిష్టారం చుట్టుపక్కల గ్రామాల వారు కంపెనీలలో పని చేయడానికి రావాలంటే ఉదండపూర్ రోడ్డు ద్వారా వచ్చి కావరంపేట నుంచి పోలేపల్లి కంపెనీలకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా పోలేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న కిష్టారం గ్రామ విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.