రోడ్ల దుస్థితి చూడతరమా
వర్షాలకు రోడ్లు గుంతలమయం
వర్షపు నీటికి ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి
ఇక్కట్లు పడుతున్న వాహనదారులు, ప్రయాణికులు
మహబూబ్ నగర్, ఆగస్టు 16 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని రహదారులు ఇటివల కురిసిన వర్షాలకు రోడ్లు చిత్తడి చిత్తడిగా మారుతున్నాయి. జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా, గురుప్రసాద్ హోటల్ ప్రాంతంలోని సీసీ రోడ్ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. రోడ్డంతా గుంతలతో నిండిపోయి, వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. గుంతలు కనిపించక వాహనాలు జారిపడే ప్రమాదాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ప్రజలు ఇప్పటికే అనేక అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. రోడ్డు స్థితిగతులపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి తగిన మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.