అవయవ దానములో అందరూ భాగ్య స్వాములు కావాలి
హైదరాబాద్ సి ఎస్ సి కోర్టు సుపరిటెండెంట్, ప్రముఖ మాజికవేత్త అంజనీకుమారి
చిక్కడుపల్లి, ఆగస్టు 13 (మనఊరు ప్రతినిధి): అవయవ దానములో అందరూ భాగ్య స్వాములు కావాలని హైదరాబాద్ సి ఎస్ సి కోర్టు సుపరిటెండెంట్, ప్రముఖ మాజికవేత్త అంజనీకుమారి అన్నారు. బుధవారం చిక్కడుపల్లిలోని కళాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మన మరణాంతరము మన శరీరంలోని ముఖ్య అవయలు ఆపదలో ఉన్న అవసరమైన వారికి దానము చేసి వారికి పునర్జన్మ నిచ్చి వారి కుటుంబాలను రక్షించిన వాళ్ళము అవుతామని అన్నారు. మన శరీరలోని భాగాలను ఇవ్వడం ద్వారా ఒక కుటుంబాన్ని నిలబెట్టడం మే కాక, ఒకరికి జీవితాన్ని ప్రసాదించిన వాళ్ళం అవుతామని తెలిపారు. శరీరం మృతి చెందినప్పుడు శరీరముతో పాటు శరీర లోపలి భాగాలలో ఉన్న ముఖ్య అవయాలు కూడా మృతి చెంది నిరుపయోగం చెందుతాయని పేర్కొన్నారు. మరొకరికి దానం చేస్తే మన అవయవాలు సజీవంగా ఉండడంతో పాటు ఇతరుల జీవితాలను నిలబెడతాయని అన్నారు. దీని గురించి సమాజంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో మార్పు తీసుకురావడం ద్వారా సమాజాన్ని చైతన్యం చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి పౌరుడు వారి బాధ్యతగా గుర్తించి అవయ దానాన్ని ప్రోత్సహించాలి ఏదో అవయవ దాన దినోత్సవం అని స్టేటస్ లో వాట్సాప్ లో పెట్టడం ద్వారా ఇది జరగదని అన్నారు, డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు ప్రజలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలు చైతన్యవంతులై తమ అవయాలను ఇతరులకు దానం చేయడానికి ముందుకు వస్తారని అన్నారు. ఈ సమయంలో సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.