తల్లిని అతి కిరాతకంగా వేట కొడవలితో నరికిన కసాయి కొడుకు

*👉కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తల్లి నరసమ్మ*

*👉వేట కొడవలితో పలు మార్లు తల్లి తల మీద నరికిన రాక్షసుడు*

*👉అప్పులు చేసి తల్లిని డబ్బుకోసం వేధిస్తూ చివరకు కత్తితో దాడి చేసిన శివ*

ఏలూరు, ఆగస్టు 10 (మనఊరు ప్రతినిధి): ఆలోచన చేయండి బిడ్డల్లారా పిండం దగ్గర నుండి రూపం వచ్చేవరకు తల్లి నవమాసాలు భద్రంగా తన కడుపులో మోసి ఎంతో కష్టంతో మనకు జన్మ ఇస్తుంది. స‌మాజంలో రోజు రోజుకు మాన‌వ విలువ‌లు అంత‌రించిపోతున్నాయి. త‌ల్లి, తండ్రి అనే తేడా లేకుండా చంపేస్తున్నారు. చంపేసుకుంటున్నారు. కన్నతల్లిని మాట్లాడే పని ఉంది ఇంటికి రమ్మని పిలిచి కర్కశంగా వెనుక నుంచి కత్తితో దాడి చేసిన తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామం లో అశోక్ నగర్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డు పక్కన చిన్నగా కూరగాయల షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తున్న జీవనం సాగిస్తున్న జక్కుల నరసమ్మను తన కొడుకు జక్కుల శివ కూరగాయల షాపు నుంచి ఇంటికి రమ్మని పిలవడంతో ఆమె ఇంటికి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా వేనకనుంచి కొడవలితో బలంగా తలపైన భుజం పైన పలుమార్లు కత్తి తో దాడి చేయడంతో తల్లి నరసమ్మ కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది,చుట్టుపక్కల వారు ఆమెను కొయ్యలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఉన్న సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ నిర్వహించి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. కొడుకు శివ అధికంగా అప్పులకు గురి అవ్వడంతో తల్లిని డబ్బుల కోసం పదేపదే వేధిస్తూ ఉండేవాడని ఈ క్రమంలో తల్లి పైన కొడుకు దాడి చేశాడని పలువురు తెలిపారు.

Previous Post Next Post