కాంగ్రెస్ నాయకుడు పార్టీకి రాజీనామా...*

 *కాంగ్రెస్ నాయకుడు పార్టీకి రాజీనామా...*

కేశంపేట, ఆగస్టు 13 (మనఊరు ప్రతినిధి): గ్రామానికి చెందిన యువ నాయకుడు తలసాని పవన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. గత కొంతకాలంగా గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటూ గ్రామస్తుల మన్ననలు పొందాడు. పార్టీలో చురుగ్గా ఉంటూ అభివృద్ధి కోసం ఆకాంక్షించే యువకుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం పట్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యం లభించకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తలసాని పవన్ కుమార్ రెడ్డి మీడియాకు తెలియజేశారు.

Previous Post Next Post