ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.రవికుమార్ నాయక్
నాగర్ కర్నూల్, ఆగస్టు 12 (మనఊరు ప్రతినిధి): జీవన శైలి వ్యాధుల వల్ల 74 శాతం మరణాలు, అనారోగ్యాలు కలుగుతున్నాయని, కావున విద్యార్థి దశ నుంచే ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం వల్ల అసంక్రమిక వ్యాధులైన రక్తపోటు,మధుమేహము, క్యాన్సర్లు,కాలేయాము, మరి మూత్రపిండాల వైఫల్యం తదితర వ్యాధులను నివారించవచ్చని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.రవికుమార్ నాయక్ తెలిపారు. మంగళవారము నాడు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సైన్స్ డిగ్రీ కళాశాల, నెల్లికొండలో విద్యార్థులకు జీవన శైలి వ్యాధులపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు
తప్పనిసరిగా 40 నిమిషాలు వ్యాయామముచేయడం, ఆహారంలో ఆకుకూరలు, కాయకూరలు, సీజనల్ పండ్లు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కేకులు, చిప్స్, సమోసాలు, బర్గర్స్, కూల్ డ్రింక్స్ తదితర జంక్ ఫుడ్ ను తీసుకోవద్దునీ సూచించారు. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులైన సిగరెట్ తంబాకు, గుట్కా, ఖైనీ, జర్దా, మద్యపానం తదితర దుర అలవాట్లకు దూరంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్, ప్రోగ్రామ్ ఆఫ్ డాక్టర్ కృష్ణమోహన్, అధ్యాపకులు, ఆరోగ్య సిబ్బంది రేనయ్య, కటకం విజయ్ కుమార్, మల్లేష్, నరసింహ, కుమార్, రమేష్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.