తిరంగా పతాకాన్ని గర్వంగా ఎగురవేద్దాం, దేశభక్తిని చాటుదాం

 *తిరంగా పతాకాన్ని గర్వంగా ఎగురవేద్దాం, దేశభక్తిని చాటుదాం*

~రాష్ట్ర బిజెపి నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి

జడ్చర్ల రూరల్, ఆగస్టు 12 (మనఊరు ప్రతినిధి): స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి ఆధ్వర్యంలో హర్ గర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి గారు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృఢమైన సంకల్పం, నిర్ణయాత్మక నాయకత్వానికి సాయుధ దళాల ధైర్య సాహసాలు, దేశ ప్రజల ఆకాంక్షలు తోడవడంతో ఆపరేషన్ సింధూర్ గొప్ప విజయం సాధించిందని నరేంద్ర మోడీ నాయకత్వంలో కొత్త సుసంపన్న, బలమైన, ఆత్మ నిర్భర్ భారత్ కు ఇది నిదర్శనం అని వారు అన్నారు. ప్రతి పౌరుడికి గర్వకారణం ఆపరేషన్ సింధు అఖండ విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు జాతీయ పతాకంతో దేశభక్తి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు అని వారు అన్నారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటూ పేద, ధనిక, చిన్న, పెద్ద, అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పథకాన్ని ఎగురవేయాలని వారు ఆకాంక్షించారు. హర్ ఘర్ తిరంగా అనేది మన త్రివర్ణ పతాకం వైభవాన్ని ఇనుమడింప చేసే ఒక ప్రత్యేక పండుగగా మార్చాలని వారు అన్నారు. ఈ ఆనందోత్సాహాల్లో త్రివర్ణ పతాకం మనల్ని ఐక్యంగా కలిపి ఉంచుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంబి బాలకృష్ణ , బిజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాబోతుల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి బాలవర్దన్ గౌడ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొంగళి శ్రీకాంత్, బీజేపీ టౌన్ అధ్యక్షులు అమర్నాథ్ గౌడ్, బిజెపి మిడ్జీల్ మండల అధ్యక్షులు నరేష్ నాయక్,యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్, జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యులు లక్ష్మ రెడ్డి, యువ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి రేఖా, బిజెవైఎం టౌన్ అధ్యక్షులు పిట్టల నరేష్, ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షులు జగదీష్ సింగ్, విశ్వనాథ్, మిడ్జిల్ బిజేపీ మాజీ అధ్యక్షులు నరేందర్,నరేష్ ,వెంకటయ్య, వట్టెం భీమయ్య, నవీన్, గణపతి, మోతిలాల్, శశాంక్, సూరజ్, దినేష్, మిరాజ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.






Previous Post Next Post