క్షయ వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించాలి
సరైన చికిత్స తీసుకుంటే క్ష వ్యాధి పూర్తిగా నయం అవుతుంది
కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్, ఆగస్టు 14 (మనఊరు ప్రతినిధి): క్షయ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించాలనే ప్రధాన ఉద్దేశంతో నాగర్ కర్నూల్ జిల్లాలో సంచార క్షయ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ బాదావత్ సంతోష్ గారు తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ జెండా ఊపి సంచార క్షయ వ్యాధి సంరక్షణ కేంద్ర వాహనాన్ని, సంచార హెచ్ఐవి పరీక్ష టూ వీలర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ టిబి సంచార వాహనం జిల్లాలోని అన్ని గ్రామాలను కవర్ అయ్యే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సంచార వాహనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆర్థిక సహకారంతో భవిష్య భారత్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్వహిస్తున్నట్టు డి ఎం హెచ్ ఓ డాక్టర్ కె. రవికుమార్ తెలియజేశారు. ఈ వాహనంలో వైద్యాధికారి, ల్యాబ్ టెక్నీషియన్, ఎక్స్రే రే టెక్నీషియన్, ప్రోగ్రాం మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విధులు నిర్వహిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో పనిచేసే ఎక్స్రే - రే మిషన్, కళ్ళే పరీక్షలు చేసే సీబీ నాట్ మిషన్ ఉంటాయి. క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటుగా వ్యాధి నివారణ అవగాహన కార్యక్రమాలు, క్రమం తప్పకుండా మందులు వాడి విధంగా ఫాలోఅప్స్ చేయడం తదితర సేవలను అందిస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె రవికుమార్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కృష్ణమోహన్, ఎ పి ఓ మినహాజ్, భవిష్య భారత్ ప్రోగ్రాం మేనేజర్ సాజిత్, దిశ ప్రోగ్రాం మేనేజర్ రమేష్, సాయికుమార్, డిపిఓ రేనయ్య, ఏ పి ఓ ఆర్ శ్రీనివాసులు, విజయ్ కుమార్, కోట్ర నిరంజన్, ఐ సి టి సి కౌన్సిలర్ శివకుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.