*ఎంపీని కలిసిన శతాబ్ది ఉత్సవ కమిటీ సభ్యులు*
మహబూబ్ నగర్, ఆగస్టు 3 (మనఊరు ప్రతినిధి): పార్లమెంట్ సభ్యులు డీకే అరుణను ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆమె గృహంలో బాదేపల్లి హైస్కూల్ శతాబ్ది ఉత్సవ కమిటీ కార్యవర్గ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా నవంబర్‌లో నిర్వహించే మూడు రోజుల ఉత్సవాలకు సహాయ సహకారాలు అందించాలని. ప్రధానంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూను ఉత్సవాలకు తీసుకురావాలని కార్యవర్గం నిర్ణయించిందని తెలిపారు. పాఠశాలను సైతం విజిట్ చేయాలని విన్నవించారు. స్పందించిన ఆమె రాష్ట్రపతిని ఆహ్వానిస్తూ పాఠశాల నుంచి మెయిల్ చేయాలని సూచించారు. అలాగే తాను సైతం మెయిల్ చేస్తూ అపాయింట్మెంట్ కోరుతానని భరోసా ఇచ్చారు. ఉత్సవాలకు కేంద్రమంత్రులను తీసుకురావాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఎంపీని కలిసిన వారిలో ఎంఈఓ మంజులదేవి, ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, ఉత్సవ కమిటీ అధ్యక్షులు బాదిమి రవిశంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.కృష్ణ, ప్రధాన కార్యదర్శి చక్రవర్తుల రమణాచార్యులు, కోశాధికారి మేడిశెట్టి రామకృష్ణ, ఉపాధ్యక్షులు జీనురాల సత్యం, ఆకుల వెంకటేష్, సంతోష్ చారి, శ్రీహరి, ప్రకాష్, అర్జున్, కార్యనిర్వహణ కార్యదర్శి కంచుకోట ఆనంద్, నరేష్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మౌనిక, సయ్యద్ ఇబ్రహీం, గోపాల్, స్వాతి, ప్రసన్న, ఉపాధ్యాయులు లక్ష్మణ్, శంకర్ బాబు ఉన్నారు.