ఐదుగురు మైనర్ బాలుర్ల ఏడేళ్ల బాలికపై అత్యాచారం

 ఐదుగురు మైనర్ బాలుర్ల ఏడేళ్ల బాలికపై అత్యాచారం

*మూడు రోజుల క్రితం ఘటన... ఆలస్యంగా వెలుగులోకి*

*-కేసు నమోదు చేసిన జడ్చర్ల పోలీసులు*


జడ్చర్ల రూరల్, జూలై 30 (మనఊరు ప్రతినిధి): మునిసిపల్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలికపై ఐదుగురు మైనర్ బాలుర్లు అత్యాచారం చేసిన ఘటన జడ్చర్ల మున్సిపాలిటీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రాంతానికి చెందిన ఎడేళ్ల బాలిక అదే ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న మరో ఐదుగురు మైనర్ బాలురు చిన్నారిపై సొంత అన్నతో సహా మరో నలుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఆటాడుకుంటూ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక రెండు రోజుల నుండి జ్వరం రావడంతో బుధవారం బాలిక తల్లి బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ పరిశీలించిన వైద్యురాలు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారన్న విషయాన్ని గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన జడ్చర్ల పోలీసులు బాలికను జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి తరలించారు. అక్కడ బాలిక ద్వారా జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వారు సేకరించారు. బాలికపై అఘాయిత్యం జరిగిన మాట వాస్తవమేనని తేలడంతో జడ్చర్ల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో బాధితురాలితో పాటు నిందితులు కూడా మైనర్లు కావడంతో ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేక ఏదైనా ఆటాడుకుంటూ అఘాయిత్యానికి పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన విషయం బయటికి తెలవడంతో జడ్చర్ల పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను ఆడుకోవడానికి బయటకి పంపాలన్న భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో బాధితురాలి తో పాటు నిందితులు కూడా మైనర్లు కావడంతో ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేక ఏదైనా ఆటాడుకుంటూ అఘాయిత్యానికి పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన విషయం బయటికి తెలియడంతో జడ్చర్ల పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను ఆడుకోవడానికి బయటికి పంపాలన్న భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Previous Post Next Post