రెసిడెన్షియల్ పాఠశాలలో తీజ్ సంబురాలు...

 *రెసిడెన్షియల్ పాఠశాలలో అంగరంగ వైభవంగా తీజ్ సంబురాలు...*

జడ్చర్ల రూరల్, ఆగస్టు 20 (మనఊరు ప్రతినిధి): మండలంలోని కోడుగల్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలలో విద్యార్థులు గురువారం నిర్వహించిన తీజ్ సంబరాలు అంబరాన్నంటాయి. తొమ్మిదిరోజులుగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలలో విద్యార్థులు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలతో మొలకల బుట్టలను సిద్ధం చేశారు. సంప్రదాయ బాటలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణంలో పెళ్లి కాని ఎంతమంది పెళ్లికాని ఆడపిల్లలు ఉంటారో అన్ని వెదురు గుల్లలు తీసుకువచ్చి వాటిని అందంగా రంగు, రంగుల నూలుదారాలతో, గువ్వలతో, ముత్యాలతో, పూసలతో, మరియు బాసింగాలు కట్టి పెళ్ళి కూతురిలా అందంగా ఆ గుల్లలని ముస్తాబు చేస్తారు.పూలతో, పచ్చటి కొమ్మలతో, ఊయలలతో కళకళలాడింది. విద్యార్థినులు సాంప్రదాయ వేషధారణలో తీజ్ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ వేదికను కళకళలాడించారు. 

ఆ తరువాత ఊరేగింపు రూపంలో తీజ్ నిమర్జన కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించారు. విద్యార్థులు నినాదాలు చేస్తూ, ఉత్సాహంగా నిమర్జనం చేయడం విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ రజిని రాగలత నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తీజ్ వంటి సంప్రదాయ పండుగలు విద్యార్థుల్లో సాంప్రదాయ చైతన్యాన్ని పెంపొందించడమే కాకుండా ఐక్యత, స్నేహభావాన్ని పెంచుతాయని అన్నారు. మన సంస్కృతి మూలాలను యువతరం మరవకుండా ఉండేందుకు ఇలాంటి వేడుకలు తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులను ప్రోత్సహించారు. ఉత్సవాల్లో విద్యార్థుల ఉత్సాహం, సాంస్కృతిక ప్రదర్శనలు, అలంకరణలు అందరి ప్రశంసలు పొందాయి. కోడుగల్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్‌లో నిర్వహించిన ఈ తీజ్ ఉత్సవాలు మరపురాని వేడుకలుగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిత, రాజ్యలక్ష్మి, స్వాతి, పార్వతి, సాయి ప్రియ, రాజశ్రీ, అవంతి, సరిత, తాహెర్, మల్లికార్జున్, శశిధర్, అమరేందర్ రెడ్డి, శరణప్ప, కృష్ణయ్య, రవికుమార్, షాహినా పర్వీన్, అనసూయ, ఉమాదేవి, నాయకులు నవీన్ రెడ్డి, సాయిరెడ్డి పాల్గొన్నారు.




Previous Post Next Post