*పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం*
జడ్చర్ల రూరల్, ఆగస్టు 3 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలోని జడ్పీఎస్ పాఠశాల జడ్చర్ల, కావేరమ్మపేట 2000-01 మధ్య పదో తరగతి చదువుకున్న పూర్వం విద్యార్థుల ఆదివారం స్నేహితుల దినోత్సవం, సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకొని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తరువాత ఒకరినొకరు పలుకరించుకుంటూ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి జ్ఞాపికలను ఏర్పాటు చేశారు. పాఠశాలకు భర్తీ పూర్వ విద్యార్థులు గురువులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఫోటోలు దిగి మధుర స్ర్ముతులను నెమరువేసుకున్నారు. బీరువాని అందరూ భోజనాల అనంతరం ఇకనుంచి ప్రతి సంవత్సరం పాఠశాల అభివృద్ధికి తమ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులంతా సహకరించాలని నిర్ణయించుకున్నారు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఉల్లాసంగా గడిపిన పూర్వ విద్యార్థులు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ బరువెక్కిన హృదయాలతో గుర్తుకొస్తున్నాయి..' 25 ఏళ్ల తర్వాత ఒక్కచోటికి పూర్వ విద్యార్థు మనం పాతిక సంవత్సరాల తరువాత ఎలా ఉంటాము, ముసలి తనం వస్తే మన ముఖం ఎలా ఉంటుంది. చిన్నపుడు నాతో గోళీలు ఆడుకున్న రాము, చిన్న, గోవిందు ఇపుడు ఎలా ఉండి ఉంటారు. అప్పట్లో నేను రోజూ ఆటపట్టించిన మీనా, రింగుల జుట్టు రోజా ఇంకా అలాగే ఉందా ..ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఇవన్నీ బాల్య జ్ఞాపకాలు. ఇప్పుడు కొన్ని ఏఐ యాప్‌లు వచ్చాయి. వాటిలో మన ఫోటో అప్‌లోడ్ చేస్తే భవిష్యత్‌లో మనం ఎలా ఉంటామో చెప్పేస్తాయి. ఇలాంటి యాప్స్ ఎన్ని వచ్చినా.. అప్పటి స్నేహితులు అందర్నీ కలిసి వారితో ముచ్చటిస్తూ.. అలనాటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటుంటే.. ఆ అనుభూతి వర్ణణాతీతం. తమ గమ్యస్థానాలకు బయలుదేరారు. అలాగే 2000-01 SSC బ్యాచ్ అద్వర్యం లో స్కూల్ కీ 25 కుర్చీలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జనంపల్లి దుష్యంత్ రెడ్డి , మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత, కౌన్సిలర్లు కుమ్మరి రాజు, జోతికృష్ణరెడ్డి, చైతన్య చోహన్, ఎం.విజయ్ , మాజీ వార్డ్ మెంబర్ భాస్కర్, జగదీష్ , పూర్వ గురువులు దేవనందం, యాదమ్మ, మేరీ, భారతి, అమినొద్దీన్, రఫీక్
పూర్వ విద్యార్థులు 2000-01 బ్యాచ్ విద్యార్థులు ప్రెసిడెంట్ సి.వెంకటేష్, బాబా, శ్రీను, బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.