ఉద్యోగులకు బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి
ఉద్యోగుల న్యాయమైన కోరికలు తీర్చాలి
జేఏసీ అధ్యక్షులు భావండ్ల వెంకటేష్
నాగర్ కర్నూల్, ఆగస్టు 3 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేద్రం లో IDOC భవనం కొల్లాపూర్ చౌరస్తా నందు ఆదివారం నాడు TGEJAC తెలంగాణ రాష్ట్ర పభుత్వ ఉద్యోగస్తుల ఐక్య కార్యాచరణ వేదిక కార్యవర్గ సమావేశం జరిగినది JAC అధ్యక్షులు భావండ్ల వెంకటేష్ అధ్యక్షతన జరిగినది ఇట్టి కార్యక్రమములో అన్ని ఉద్యోగ ,ఉపాధ్యాయ , పెన్షనర్ ల సంఘ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర JAC పిలుపు మేరకు ఆగస్టు 15 లోపు ప్రభుత్వం ఉద్యోగస్తుల సమస్యల సాధన దిశగా అడుగులు వేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు ఉద్యోగులను సమాయత్తం చేస్తూ సన్నహక సమావేశం జరుపనైనది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వవలసిన ప్రభుత్వం బకాయి పడిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేయడమైనది. అదేవిధంగా ఆర్థికేతర విషయాలతో ఉద్యోగస్తుల ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిశీలించాలని డిమాండ్ చేయడమైనది ఇట్టి కార్యక్రమంలో JAC జిల్లా సెక్రటరీ జనరల్ పి. రాజశేఖర్ రావు TGO. అదనపు సెక్రటరీ జనరల్ డి సత్యనారాయణ రెడ్డి PRTU TS,
కో చైర్మన్ డాక్టర్ యం శ్రీధర్ శర్మ టిఎస్ యుటిఎఫ్ , కె శ్రీధర్ రావు ఎస్టీయు సిహెచ్ వెంకట్ టిపిటిఎఫ్, ఫైనాన్స్ సెక్రటరీ ఎండి షర్పోద్దీన్ TNGO , శ్రీధర్ పెన్షనర్ అసోసియేషన్ వైస్ చైర్మెన్ లు టి సురేందర్ రెడ్డి, డి మురళి ఆర్ కృష్ణ లక్ష్మీనరసింహ రావు నిరంజన్ యాదవ్ రమేష్ పబ్లిసిటీ సెక్రెటరీ కె రాజు తదితరులు పాల్గొన్నారు