వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు
తొర్రూరు ఎస్సై ఉపేందర్
తొర్రూరు, ఆగస్టు 12 (మనఊరు ప్రతినిధి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తొర్రూరు ఎస్సై ఉపేందర్ అన్నారు. తొర్రూరు మండలంలోని గుర్తూరు- సోమారం గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న ఈదుల వాగును మంగళవారం ఎస్సై ఉపేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై ఉపేందర్ మాట్లాడుతూ.. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు ఎవరూ రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కు కాల్ చేయాలని కోరారు.