విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి
కొడంగల్ ఎస్సై సత్యనారాయణ
కొడంగల్, ఆగస్టు 12 (మనఊరు ప్రతినిధి): విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని, ర్యాగింగ్‌కు పాల్పడి తమ బంగారు భవిష్యత్‌ను కోల్పోవడం మంచి పద్ధతి కాదని ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ర్యాగింగ్ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ ర్యాగింగ్ ఒక ఆసాంఘిక ఆకృత్యమని, దాని జోలికి విద్యార్థులు వెళ్లొద్దని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఎవరైనా ర్యాగింగ్ లు చేసిన ఎలాంటి ఇబ్బందులు పెట్టిన వెంటనే ఉపాధ్యాయులకు తెలపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రఫియా ఖనమ్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.