అన్నదానం ప్రాణకోటికి గొప్పసేవ....
ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో రోగి సాయకులకు అన్నప్రసాద పంపిణీ....
మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి.ఉషారాణి
నాగర్ కర్నూల్, ఆగస్టు 30 (మనఊరు ప్రతినిధి): వినాయక చతుర్థి సంబరాల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో శనివారం నాడు రోగి వెంట ఉన్న సహాయకులకు అన్నప్రసాద పంపిణీ చేశారు. ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి ఉషారాణి మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నదానం సానకోటికి గొప్ప సేవా కార్యక్రమనీ అన్నారు. వైద్యులు నర్సింగ్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది సమన్వయంతో ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమాన్ని రేసిడెంట్ మెడికల్ ఆఫీసర్ సివిల్ సర్జన్ డాక్టర్ రవిశంకర్ నాయక్ ప్రారంభించారు. మొదటగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మహాగణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.తీర్థ ప్రసాదల పంపిణీ అనంతరం నర్సింగ్ ఆఫీసర్లు సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి వెంట ఉన్న సహాయకుల అందరికీ అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ రవి శంకర్ నాయక్, డాక్టర్ పి.పూర్ణిమ, నర్సింగ్ ఆఫీసర్లు ఎం ఆనంద్ కుమార్ ,ఎం కిరణ్, జానకి దేవి, కవిత, రాధ, కావేరి, సుమలత, విజయ,ఆంజనేయులు,అనిత,కృష్ణవేణి,నాగమణి, అరుణ్ కుమార్,మన్మోహన్ రెడ్డి,హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ టి. యాదగిరి, మెడికో సోషల్ వర్కర్స్ డి.బాలమ్మ, విజయలక్ష్మి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.