వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు...

 రామాలయంలో వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు...

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు..

నాగర్ కర్నూల్, ఆగస్టు 9 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రని రాంనగర్ కాలనీలో గల శ్రీతారామచంద్ర స్వామి దేవాలయంలోశ్రావణ రాఖీ పౌర్ణమి శనివారం రోజు సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా జరిగాయి.ఆలయ ప్రధాన అర్చకులు కందాడైరాజన్ అయ్యంగార్ మాట్లాడుతూ సూక్ష్మ మార్గంలో మోక్షం పొందేందుకు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించడం ఎంతో పుణ్యఫలితం అని అన్నారు. భక్తుల శక్తి కొలది భక్తిశ్రద్ధలతో స్వామివారిని స్మరించడం వలన పుణ్యఫలం దక్కుతుందని అన్నారు.అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు భక్తులు వేదాలు ఆశీర్వచనం స్పష్టంగా. రామాలయం అన్నప్రసాద కమిటీ వారిచే భోజన వసతి ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ సభ్యులు రవీందర్, మల్లేష్, గొల్ల రాములు, నారాయణ,కిషోర్ భక్తులు మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు.




Previous Post Next Post