స్నేహానికి గుర్తుగా.. తోటి స్నేహితుడికి పూర్వపు విద్యార్ధుల చేయూత
ఖిల్లా ఘనపూర్, ఆగస్టు 21 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ ఖిల్లా ఘనపూర్ పాఠశాలలో 1993-94 బ్యాచ్ 10వ తరగతికి చెందిన అజీమ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పూర్వపు విద్యార్ధులు తమతో 10 సంవత్సరాలపాటు విద్యను అభ్యసించి అనారోగ్యంతో బాధపడుతున్న అజీమ్ కు క్యామ రాజు తమవంతుగా చేయూతనందించారు. ఇలా రెండు విడతలుగా తోటి స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకున్నందుకు మండల కేంద్రానికి చెందిన ప్రజలు వారి స్నేహబంధాన్ని అభినందించారు. ముందు తరాలకు మీ స్నేహబంధం ఆదర్శంగా ఉంటుందని వారు అన్నారు. ఈ సందర్భంగా క్యామ రాజుకు సలీం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యామ రాజు, బండారి కృష్ణయ్య, ఆశన్న, వెంకటరమణ, గంటల శ్రీను, గోపాల్, సలీం, సుజ్జి, తదితరులు పాల్గొన్నారు.