భక్త జనసంద్రంగా తిరుమలయ్య గుట్ట
వనపర్తి, ఆగస్టు 16 (మనఊరు ప్రతినిధి): మండలంలోని పెద్దగూడెం శివారులోని తిరుమలయ్య గుట్ట శనివారం భక్తులతో జనసంద్రంగా మారింది. శ్రావణ శనివారం సందర్భంగా చుట్టు పక్కల ప్రజలు పెద్ద ఎత్తున గుట్టపైకి తరలివచ్చారు. గుట్టపై తినుబండారాలు, పిల్లల ఆట వస్తువులు, తదితర దుకాణాలు వెలిశాయి. భక్తులు గుట్టపై ప్రత్యేక వంటలను తయారు చేసి స్వామికి నైవేద్యం సమర్పించారు. ఉందె కోటి రమేష్ దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకొన్నారు. దేవస్థాన ట్రస్టు ద్వారా అన్నదానం చేశారు.