మార్కులు వేయలేదని టీచర్ పై విద్యార్థి దాడి
థాయిలాండ్ లోని ఓ స్కూల్లో తరగతి గదిలోనే ఉపాధ్యాయులుపై విద్రార్థి దాడికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉథాయ్ థానీ ప్రావిన్స్లో 11వ తరగతి విద్యార్థి మ్యాథ్స్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. మహిళా టీచర్ తనకు తక్కువ మార్కులు వేయడం వల్లే ఫెయిలయ్యానని భావించాడు. ఆగ్రహంతో టీచర్ వైపు దూసుకెళ్లి కాలితో తన్నుతూ పిడిగుద్దులు కురిపించాడు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.