హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం 

బిజెపి మండల ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి 

కల్వకుర్తి, సెప్టెంబరు 3 (మనఊరు ప్రతినిధి): హమీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బిజెపి మండల ఉపాధ్యక్షులు నోముల రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఎల్లికట్టలో బిజెపి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రుణమాఫీ, రైతుభరోసా అమలులో ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ఆరు గ్యారంటీలు.. 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి 20 నెలలు గడిచినా నేటికీ నెరవేర్చడం లేదన్నారు. మహిళలకు రూ.2,500 భృతి, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, వృద్ధాప్య పింఛన్ పెంపు, ఇంట్లో ఇద్దరు వృద్ధులకు నూతన పింఛన్, రైతులకు రైతు భరోసా రూ.15 వేలు తదితర హామీల ఊసే లేకుండాపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ పాలనలో ప్రజలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లో నిర్మించిన సీసీరోడ్లు, శ్మశాన వాటికలు ఇతర అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని గుర్తుచేశారు. ఎల్లికట్ట నుంచి మాధారం ప్రధాన రహదారి కోసం ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఇప్పటి వరకు మరమతుకు నోచుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.




Previous Post Next Post