విఘ్నేశ్వరస్వామి లడ్డు వేలం లక్ష 32 వేలు

మిడ్జిల్ లో విఘ్నేశ్వరస్వామి లడ్డు వేలం లక్ష 32 వేల 116 

  మిడ్జిల్, సెప్టెంబరు 3 (మనఊరు ప్రతినిధి): మిడ్జిల్ మండల కేంద్రంలో వ్యాపార సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విఘ్నేశ్వరస్వామి లడ్డూ వేలం పాట బుధవారం నిర్వహించారు. ఈ వేలం పాటలో మండల కేంద్రానికి చెందిన ఎడ్ల మల్లేష్ రూ 1,32,116లకు లడ్డును సొంతం చేసుకున్నాడు. అనంతరం వారం రోజులు పూజలు అందుకున్న గణపతిని వ్యాపార సంఘం నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి భజనలు, కోలాటాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు చేస్తూ గణపతిని నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో వ్యాపార సంఘం అధ్యక్షులు గంజి కృష్ణ, ఉత్సవ కమిటీ అధ్యక్షులు మిడిదొడ్డి విజయ్ కుమార్, ఎల్మశెట్టి శ్రీనివాసులు, రాజేష్, అశోక్, శేఖర్గో, గోపాల్, ప్రదీప్ రెడ్డి, శ్రీధర్, కృష్ణగౌడ్, గంజి శేఖర్, గంజి వెంకటేష్, గంజి లింగం, భాష బాల నారాయణ, భీమ్ రాజ్, మిడిదొడ్డి శ్రీనివాసులు, మిడిదొడ్డి పురుషోత్తం, చెరుకు శ్రీనివాసులు, మద్ది వెంకటరెడ్డి, ఎండి జాంగిర్, రాజు నాయక్, చెన్నకేశవులు, వరిగెల శ్రీనివాసులు, శేఖర్, చెరుకు తిరుపతయ్య, సురేందర్, శ్రీనివాసులు, వెంకటేష్,రమేష్ నాయక్, మద్ది నరసింహారెడ్డి, ఏదుల శివ, సతీష్ నాయక్ లతో పాటు పలువురు వ్యాపార సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




Previous Post Next Post