ఉపాద్యాయ వృత్తి పవిత్రమైనది

 ఉపాద్యాయ వృత్తి పవిత్రమైనది 

విద్యార్థులకు మార్గదర్శకుడు గురువు

సమాజ నిర్మాణానికి ఆధ్యుడు

అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్

వనపర్తి, సెప్టెంబరు 7 (మనఊరు ప్రతినిధి): దేశ భవిష్యత్తు, నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదని, విద్యతోనే దేశం అభివృద్ధి చెందుతుందని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ అన్నారు. వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురుపూజ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన జడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం పాఠశాల హెచ్ఎం పి.గాయత్రి, జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు గుంట్ల గురురాజు, స్కూల్ అసిస్టెంట్ పలుస శ్రీనివాస్ గౌడ్ లను ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో ఉపాధ్యాయుడు తన జీవితంలో వేల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంతో ఉపాధ్యాయులు ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యార్థులకు చదువుతో పాటు, సంస్కారాన్ని నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ మార్పు ఉపాధ్యాయులనే ఆధారపడి ఉందని, ఉపాధ్యాయులు గురుతర బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. వనపర్తిలో మేధావులను, ఉపాధ్యాయులను, ఉద్యోగులందర్నీ సన్మానించడం అఖిలపక్ష ఐక్యవేదిక బాధ్యతగా తీసుకొని వారిని సన్మానించడం జరుగుతుందని, అందుబాటులో ఉన్న వారిని సన్మానిస్తూ వెళ్తామని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు, కొత్తగొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య ,బొడ్డుపల్లి సతీష్, రాజనగరం రామస్వామి నాగరాజు రమేష్ జింగిడిపురం రవి, విజేత రాములు, జడ్పీ.హెచ్.ఎస్ బాలుర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.




Previous Post Next Post