కోర్టులో గెలిచినా... భూమి దక్కలేదు!
కబ్జాలకు అడ్డాగా మారిన కల్వకుర్తి
పెట్రోల్ బాటిల్‌తో నిరసనకు దిగిన వృద్ధ దంపతులు
కల్వకుర్తి, వెల్దండ, నవంబరు 28 (మనఊరు ప్రతినిధి): కోర్టు తీర్పు మా పక్షం చెప్పింది… కానీ మా భూమి మాకు ఎందుకు రాలేదు?” అంటూ కల్వకుర్తి పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు బచ్చు సుగుణమ్మ (70), ఎల్లయ్య (73) ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పెట్రోల్ బాటిల్ చేతబట్టి నిరసన తెలపడం స్థానికంగా ఉద్రిక్తత రేపింది.
వివరాల్లోకి వెళ్తే…
వెల్దండ మండల పరిధిలోని కొట్ర శివారులో 5.5 ఎకరాల భూమిని సుగుణమ్మ–ఎల్లయ్య దంపతులు 1991లో సంపల్లి యాదమ్మ వద్ద కొనుగోలు చేశారు. అయితే భూమికి ఆనుకుని ఉన్న ధనరాజ్ రెడ్డి, రూపేష్ రెడ్డి 2009 నుంచి సరిహద్దులను చెరిపివేస్తూ తమ పొలంలోకి అక్రమంగా చొరబడి కబ్జా దంపతులు ఆరోపిస్తున్నారు. దీంతో వారు 2011లో కల్వకుర్తి సివిల్ కోర్టును ఆశ్రయించగా, 2025 మార్చిలో తమకు అనుకూలంగా తీర్పు వెలువడిందని పేర్కొన్నారు. తీర్పు కాపీ అందిన తరువాత స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్రమార్కులు తమను బెదిరించారని, స్థలంలో అక్రమ నిర్మాణాలు చేస్తుండటాన్ని ఆపలేకపోతున్నామని వృద్ధ దంపతులు వాపోయారు. ఇంకా, ఫిర్యాదు చేయడానికి వెళ్లినా పోలీసులు దానిని స్వీకరించకుండా “అక్కడికి వెళ్లొద్దు” అంటూ తమ బెదిరింపులు వారి ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులు, ఎస్పీ ఆఫీస్, పోలీస్ స్టేషన్… అన్ని చుట్టూ తిరిగాం. కానీ ఎక్కడా న్యాయం జరగలేదు. ఈ వయసులో మాకు ఎవరున్నారో? అంటూ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నా న్యాయం కావాలంటే పెట్రోల్ బాటిల్‌తో నిరసన తెలిపారు.

