ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్

 ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్ 

పార్టీని వీడుతున్న సొంత పార్టీ నాయకులు

పల్లెగడ్డ గ్రామంలో 

కనుమరుగైన కాంగ్రెస్

 నవాబుపేట, నవంబరు 28 (మనఊరు ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ సొంత పార్టీ విధివిధానాలు, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పోకడ నచ్చక పార్టీని వీడి ఇతర పార్టీలలో చేరుతున్నారు. రెండు సంవత్సరాలుగా పార్టీలో అధికారం ఉన్నా కూడా ఆ పార్టీ నుండి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నుండి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదు, ఆరోపిస్తూ పలు గ్రామాలకు చెందిన నాయకులు తమ సొంత పార్టీని వీడి ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. అందులో భాగంగా పల్లెగడ్డ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు శేఖర్ ఆధ్వర్యంలో శనివారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మూకుమ్మడిగా మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. దాంతో గ్రామంలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైంది. మండల పరిధిలోని రేకుల చౌడాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కూడా తమ పార్టీని వీడి మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు మాదేమోని నర్సింలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికలతో కాంగ్రెస్ పార్టీ మండలంలో బలహీనపడుతుండగా టిఆర్ఎస్ పార్టీ బలపడుతున్నది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులలో తీవ్ర ఆందోళన. పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడంలో ఆ పార్టీ మండల నాయకులు విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.



Previous Post Next Post