రూపుల తండాలో తొలి సర్పంచ్ ఏకగ్రీవం…
సర్పంచ్ పదవి దక్కించుకున్న జవహర్‌లాల్ నాయక్
రుద్రంగి, నవంబరు 27 (మనఊరు ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజునే తొలి ఏకగ్రీవం నమోదైంది. రుద్రంగి మండలం రూపులా తండాలో సర్పంచ్ పదవి పోటీ లేకుండానే జవహర్‌లాల్ నాయక్‌కు కైవసం అయింది. గ్రామాభివృద్ధి కోసం జవహర్‌లాల్ నాయిక్ నాయకత్వమే సరైనదన్న నమ్మకంతో గ్రామస్థులు ఏకగ్రీవంగా ఆయనను తమ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. తండా అభివృద్ధి దిశగా కొత్త ప్రణాళికలు, సంకల్పాలతో ముందుకు తీసుకెళ్తారనే విశ్వాసంతో గ్రామ ప్రజల ప్రతిపాదనలను ముందుగానే అంగీకరించబోమని తీర్మానించారు. గ్రామం మొత్తమూ ఏకకంఠంతో జవహర్‌లాల్ నాయక్‌ను ఎన్నుకోవడంతో తండాలో పండగ వాతావరణం. అనంతరం గ్రామస్తులు బాణాసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు.
