ఆలయ అభివృద్ధికి ఐదు లక్షల విరాళం అందజేత..

 సంతోషిమాత ఆలయ అభివృద్ధికి ఐదు లక్షల విరాళం అందజేత..


నాగర్ కర్నూల్, డిసెంబరు 5 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని హోంనగర్ కాలనీలో గల శ్రీ సంతోషిమాత ఆలయం అభివృద్ధి కొరకు నాగర్ కర్నూల్ కు చెందిన ఆకుతోట సురేష్,చంద్రకళ దంపతులు వారి కుటుంబ సభ్యులు సాయి తేజ సింధుప్రియ పేరిట శుక్రవారం నాడు శ్రీ సంతోషిమాత ఆలయ కమిటీ సభ్యులు భాగ్యమ్మ, శ్రీదేవి, రాజేశ్వరి, శివకుమార్ లకు ఐదు లక్షల చెక్కును ఆలయఅభివృద్ధి నిమిత్తం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అల్లాడి ప్రకాష్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ప్రతి శుక్రవారంఆలయంలో అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం ఉద్యాపనం, వడిబియ్యం, లలిత సహస్ర పారాయణ పఠనం, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల తోపాటు అన్నప్రసాద వితరణ ఉంటుందని, ఈ ప్రాంతంలోనీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షలు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, కాలనీవాసులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 




Previous Post Next Post