పాలెం బ్రిడ్జి సమీపంలో హైవేపై జరిగిన దుర్ఘటన
చికిత్స పొందుతూ వేముల గ్రామ కార్యదర్శి సతీష్ మృతి
వనపర్తి, నవంబర్ 7 (మనఊరు ప్రతినిధి): వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం బ్రిడ్జి సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై అప్రయత్నంగా ఆగి ఉన్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు పంచాయతీ కార్యదర్శులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం, గద్వాల నుంచి మూసాపేటకు విధులకు వెళుతున్న పంచాయతీ కార్యదర్శులు మహేందర్, కార్తీక్, నాగేందర్, సతీష్ ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. లారీ ఢీ కొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. అందులో ముగ్గురు కార్యదర్శులు మహేందర్, కార్తీక్, నాగేందర్ స్వల్ప గాయాలతో బయటపడగా,
వేముల గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ రెడ్డి కారులోనే ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సహాయంతో ఆయనను బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రున్ని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పంచాయతీ వేముల పంచాయతీ సతీష్ రెడ్డి (30) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.



