తల్లి సమాధి వద్దే మూడు రోజులు…

తల్లి సమాధి వద్దే మూడు రోజులు… 

యువతి ప్రవర్తనతో కరీంనగర్‌లో కలకలం

షీటీమ్స్, సఖి టీమ్ జోక్యం – వైద్య కౌన్సిలింగ్‌కు చర్యలు


కరీంనగర్, డిసెంబరు 2 (మనఊరు ప్రతినిధి): కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. పట్టణంలోని ఒక కబరస్తాన్ (స్మశానం)లో ఓ యువతి గత మూడు రోజులుగా తన తల్లి సమాధి పక్కనే రాత్రింబగళ్లు గడుపుతుండటంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. తల్లిని కోల్పోయిన బాధను తట్టుకోలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

యువతి పగలంతా సమాధి వద్ద కూర్చోవడం, రాత్రిళ్లు అక్కడే నిద్రించడం చూసి గ్రామస్తులు ఆందోళన చెందారు. ఇంటిమంది, స్థానికులు ఎంతగా ఒప్పించినా ఆమె అక్కడి నుండి వెళ్లేందుకు నిరాకరించడంతో పరిస్థితి క్లిష్టరూపం దాల్చింది. చివరికి విషయం అధికారుల దృష్టికి వెళ్లింది.

సమాచారం అందుకున్న షీ టీమ్స్, సఖి టీమ్, మహిళా సంక్షేమ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని యువతిని పCounseling చేయడానికి, అవసరమైన వైద్య సహాయం అందించడానికి చర్యలు ప్రారంభించారు. యువతి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి సురక్షిత పర్యవేక్షణకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనను స్థానికులు హృదయవిదారకంగా అభివర్ణిస్తూ యువతి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Previous Post Next Post