నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

 నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు 

 కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి 

కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి 

కల్వకుర్తి, డిసెంబరు 10 (మనఊరు ప్రతినిధి): ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎంతటి వారిని వదిలిపెట్టబోమని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. 11న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, మీటింగ్స్ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసినందున అన్ని గ్రామాలలో సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్, 144 సిఆర్, పిసి అమలులో ఉన్నదని, అభ్యర్థులు గాని వారి అనుచరులు గాని ఎవరైనా ఇకముందు ఎన్నికల ప్రచారం చేసినా, గుంపులు గుంపులుగా ఉన్నా, ఓటర్లు ప్రలోభపెట్టినా డబ్బులు, మద్యం, పంపిణీ చేసినా, ఇతర పార్టీల వారిని కించపరిచేలా మాట్లాడినా, వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించినా కోడ్ ఉల్లంఘన కూడా కిందకే వస్తుందని ఆయన తెలిపారు. ఓటర్లు సరైన సమయానికి పోలింగ్ బూత్ కి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్సై నిర్ణయించారు. అదనంగా నేరుగా గాని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా గాని, సామాజిక మాధ్యమాల ద్వారా గాని ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు హాజరైనా చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలియజేశారు.

Previous Post Next Post