సుఖదాదేవి ఆస్పత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

 సుఖదాదేవి కార్పొరేట్ ఆస్పత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల రూరల్, డిసెంబరు 10 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో అత్యాధునిక వైద్య సేవలకు నాంది పలుకుతూ నిర్మించిన సుఖదాదేవి ఆస్పత్రిని బుధవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణంలో మొదటిసారి గైనకాలజీ విభాగంతో సేవలు ప్రారంభించి ప్రజల విశ్వాసాన్ని పొందిన డా. విజయలక్ష్మి నేతృత్వంలో నేడు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఆస్పత్రి అభివృద్ధి చెంది ప్రజలకు అధిక ప్రమాణాల వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉండటంపై సంతోషం వ్యక్తం చేశారు. అత్యాధునిక పరికరాలు, కార్పొరేట్ తరహా బెడ్లు ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రి ప్రజలకు ఎంతో మేలు చేయనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసుపత్రి సందర్శించి అభినందించారు. ఆస్పత్రి ప్రారంభోత్సవ వేడుకలో నిర్వహకులు బాదిమి సుఖదాదేవి, బాదిమి శివకుమార్, బి. రవిశంకర్, వైద్యులు బాదిమి సూర్య, సంకీర్తన, గౌతమి, ధ్రువ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జెపిఎన్సీ రవికుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, జిల్లా, పట్టణంలోని ప్రముఖ వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.





Previous Post Next Post