ఎల్లికట్ట సర్పంచ్‌గా సుమిత్ర విజయఢంకా
కల్వకుర్తి, డిసెంబరు 11 (మనఊరు ప్రతినిధి): మండలంలోని ఎల్లికట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో సుమిత్ర భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రత్యర్థులపై దాదాపు 500 ఓట్ల మెజార్టీ తో ఘనవిజయం సాధించిన ఆమెను గ్రామ ప్రజలు హర్షధ్వానాలతో స్వాగతించారు. తదుపరి సుమిత్ర మాట్లాడుతూ ఇంత భారీ మెజార్టీతో నన్ను ఆశీర్వదించిన ఎల్లికట్ట గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నా మీద నమ్మకం ఉంచి ఓటేసిన ప్రతి ఒక్క ఓటరు మహాశయునికి… నా విజయానికి రోజుకొక క్షణం కష్టపడి తోడ్పడిన నిస్వార్థ కార్యకర్తలందరికీ పేరు పేరున రుణపడి ఉంటాను. గ్రామ అభివృద్ధి నా ఏకైక లక్ష్యం. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాను” అని తెలిపారు. సుమిత్ర విజయంలో గ్రామ యువత, మహిళలు, పెద్దలు కీలకపాత్ర పోషించారు. గ్రామంలో వేడుకల వాతావరణం నెలకొంది.
