ఏటీఎంలో మంటలు…

ఏటీఎంలో మంటలు… 

చితికిన మెషిన్

 కాపాడుకున్న నగదు

జడ్చర్ల, డిసెంబరు 11 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గురువారం అకస్మాత్తుగా మంటలు చెలరేగి హల్‌చల్ రేపాయి. ఏటీఎం ముందుభాగంలో అగ్ని అంటుకోవడంతో పొగలు కమ్ముకుంటుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ లోపల ఉన్న నగదుకు మంటలు వ్యాపించకపోవడంతో ఎటీఎం యంత్రం స్వల్పంగా మాత్రమే దెబ్బతిన్నది. దీంతో ఎస్బీఐ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలు షార్ట్‌ సర్క్యూట్ కారణంగా చెలరేగినవేనా? లేక మరో కారణముందా? అన్నది తెలుసుకోవడానికి సంబంధిత విభాగాలు విచారణ చేపట్టాయి.

Previous Post Next Post