మిడ్జిల్ ను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం

 మిడ్జిల్ ను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం

సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల శంకర్ విజయం 

మిడ్జిల్, డిసెంబరు (మనఊరు ప్రతినిధి): గ్రామపంచాయతీలో ప్రజలు ఆదరించి ఓటు వేసి గెలిపించిన వెంటనే అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల శంకర్ విజయం అన్నారు.

మిడ్జిల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల శంకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆదరణ నాకు స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన హామీలను వాస్తవ రూపంలో అమలు చేస్తోంది. కాబట్టి నాకు తప్పకుండా గెలుపు ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఎడ్ల శంకర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్, సిలిండర్‌కు రూ.500 బోనస్, మహిళలకు జీరో వడ్డీ రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ, రైతులకు రైతు భరోసా, ముదిరాజ్ కుటుంబాలకు చేపల పంపిణీ… ప్రతి వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపశమనాలు అందిస్తోందని తెలిపారు. తాను ప్రస్తుతం ఈదమ్మ తల్లి గుడి చైర్మన్‌గా సేవలందిస్తున్నానని, అమ్మ దీవెనలతో సర్పంచ్ స్థానాన్ని గెలుచుకుంటానని నమ్మకం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, వీధి లైట్లు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డుల జారీ వంటి పనుల్లో ముందుండి పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు నా సమస్యలే. ప్రమాదాలు, చావులు, భూ సమస్యలు… ఏ ఇబ్బంది వచ్చినా మా పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తమ కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తున్నారని, వారి కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో 15 సంవత్సరాల క్రితం పోటీ చేసి ఓడిపోయిన అనుభవం ఉన్నప్పటికీ ఈసారి ప్రజలు తనను ఆశీర్వదిస్తారన్న పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతున్నానని ఎడ్ల శంకర్ తెలిపారు. నన్ను గెలిపిస్తే మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను… ప్రజల సేవకుడిగా ఉంటాను అని విజ్ఞప్తి చేశారు.




Previous Post Next Post