ఘనంగా సత్య సాయి సాయి నామ కీర్తనలు

 ఘనంగా సత్య సాయి

సాయి నామ కీర్తనలు- 

భక్తి పారవశ్య౦

పట్టణ వీధుల్లో శ్రీ సత్య సాయి ప్రేమ ప్రవాహిని రథోత్సవ ఊరేగింపు కార్యక్రమం..

నాగర్ కర్నూల్, డిసెంబరు 8 (మనఊరు ప్రతినిధి): భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆయన ప్రేమ సందేశాన్ని (అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి) వ్యాప్తి చేయడానికి నిర్వహించబడుతున్న పవిత్రమైన శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథోత్సవ పర్యటన యాత్రా కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి సేవా సంస్థల నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ గుబ్బా శంకరయ్య ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రథ యాత్రలో సేవా కార్యక్రమాలు జరుగుతాయని, ఇది భక్తులను దైవ సందేశంతో ఏకం చేస్తుందని, భక్తులు పాల్గొని స్వామివారి ప్రేమను పొందుతారని అన్నారు. సత్యసాయి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని సత్యసాయి ప్రేమ ప్రవాహిని పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 

నాగర్ కర్నూల్ లో స్వామి వారూ 1979లో స్వయంగా మందిరంలో సందర్శించారని హకీమ్ విశ్వం ప్రసాద్ గుర్తు చేశారు. రథోత్సవంలో స్వామివారి పాదకలను ఊరేగిస్తూ దేశంలోని సుమారు. 500 జిల్లాల్లో 2.5 లక్షల కిలోమీటర్లు ప్రేమ ప్రవాహిని రథాలు ప్రచారం చేస్తాయని, సత్యసాయి అవతార వైభవం, సేవా మార్గాలు, ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రజలకు వివరిస్తూ చైతన్య పరుస్తాయని తెలియజేశారు. ఈ రథోత్సవం పట్టణంలోని సొంత బజార్ మెయిన్ రోడ్ ప్రధాన వీధుల గుండా భక్తిశ్రద్ధలతో సాయి నామస్మరణ ప్రత్యేక భజనలతో రామ్ నగర్ కాలనీ ఆలయం వరకు చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి భక్తులు హకీం విశ్వప్రసాద్ సత్యనారాయణ, బాలకృష్ణ, పాండురంగయ్య, కృష్ణయ్య, వెంకటశెట్టి, సతీష్ కుమార్, బాలరాజు, విశ్వనాథం, మధు, వరప్రసాద్, విజయభాస్కర్, శ్రీనివాసులు, పాండు రంగారెడ్డి, సాయి గీత, సువర్ణ, లలిత, సునంద, పద్మ, సత్య సాయి, యువత, బాలవికాస్ విద్యార్థులు, మహిళా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.










Previous Post Next Post