కాంసానిపల్లి అభివృద్ధే ప్రధాన ధ్యేయం

కాంసానిపల్లి అభివృద్ధే లక్ష్యం

అచ్చంపేట, డిసెంబరు 13 (మనఊరు ప్రతినిధి): తమను ఆదరించి అధిక మెజార్టీతో గెలిపిస్తే కాంసానిపల్లి అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తామని సర్పంచు అభ్యర్థి బయ్య ప్రేమలత నరేష్‌యాదవ్‌ అన్నారు. శనివారం గ్రామంలో బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీ ఆదరణ, అండదండలు, అన్నింటికీ మించి మీ ఆశీస్సులు మాకు కావాలని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నామన్నారు. మీ విలువైన ఓటు వేసి నన్ను సర్పంచ్‌ గా గెలిపిస్తే గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ప్రేమలత అన్నారు. గ్రామ ప్రజల సమస్యలు, ప్రజా అవసరాల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. తన భర్త బయ్య నరేష్‌యాదవ్‌ ఐదేళ్ల పాటు వార్డుమెంబర్‌గా పని చేసిన అనుభవం ఉందన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. పాఠశాలల అభివృద్ధితో పాటు, గ్రామంలోని ఆలయాల అభివృద్ధికి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధిలో యువతను, మహిళలను, గ్రామ పెద్దలను అందరినీ భాగస్వామ్యం చేస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులు, గ్రామ పంచాయతీకి టాక్స్‌ల రూపేణా వచ్చే నిధుల వివరాలతో పాటు, జమా, ఖర్చుల వివరాలను అణా పైసాతో సహా ప్రజలకు తెలిసే విధంగా పారదర్శకంగా గ్రామ పాలన సాగిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నామన్నారు. చివరగా ఒక్కమాట స్పష్టం చేయదలిచామన్నారు. నేను సర్పంచ్‌ గా గెలిచాక ఎక్కడికీ వెళ్లను. గ్రామ సేవకురాలిగా ఊర్లోనే ఉంటాను. నా ఊరి ప్రజల కోసం శ్రమిస్తాను. ప్రజల సమస్యలను వినేందుకు, వాటిని పరిష్కరించేందుకు నిరంతరం గ్రామంలోనే అందుబాటులో ఉంటాను. ఇది నేను నమ్మే దైవం మీద ఒట్టేసి చెపుతున్నా.. మీ ఊరి బిడ్డనే..నన్ను గెలిపించండి. గ్రామాభివృద్ధిని నా పై వదిలేయండి.. పూర్తి సహకారాన్ని అందించడమే నా లక్ష్యమన్నారు. తనకు కేటాయించిన బ్యాటు గుర్తుతో పాటు తమ ప్యానెల్‌కు సంబంధించిన వార్డు నెంబర్ల గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని బయ్య ప్రేమలత కోరారు.

Previous Post Next Post