నాలుగు మండలాల్లో కాంగ్రెస్ దూకుడు…

 నాలుగు మండలాల్లో కాంగ్రెస్ దూకుడు…

తాండ్రలో 10కి 10, పోతేపల్లిలో బీఆర్ఎస్ సునామీ!

కల్వకుర్తి, వెల్దండలో కాంగ్రెస్ వరస విజయాలు…

పోతేపల్లిలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్

డివిజన్‌లో కాంగ్రెస్ ఆధిపత్యం…

తాండ్ర–పోతేపల్లి ఫలితాలు కేంద్రం ఆకర్షణ

67 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు…

బీఆర్ఎస్ 27, బీజేపీ 2, స్వతంత్రులు 3

తాండ్రలో ఆశాదీప్ రెడ్డి దుమ్మురేపు – 887 ఓట్ల మెజారిటీ!

కాంగ్రెస్ కోటలో బీఆర్ఎస్ బోనీ…

పోతేపల్లిలో 10కి 10 గెలుపు!

కల్వకుర్తి, డిసెంబరు 12 (మనఊరు ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌లో తొలి విడత సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్ అన్ని కేంద్రాల్లో సాఫీగా పోలింగ్ పూర్తిచేసింది. డివిజన్‌లోని 4 మండలాల్లో 99 సర్పంచ్ స్థానాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. 67 స్థానాలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకోగా, బీఆర్ఎస్ 27, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాలు సాధించారు.

కల్వకుర్తి మండలంలో 

24 గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 7, బీజేపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. తాండ్ర గ్రామంలో కాంగ్రెస్ 10కి 10 వార్డులు క్లీన్ స్వీప్ చేయగా, సర్పంచ్ అభ్యర్థి కాయితి ఆశాదీప్ రెడ్డి 887 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మార్చాల గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని కృష్ణారెడ్డి 276 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పై గెలిపోవడం చర్చనీయాంశమైంది. అలాగే ఎల్లికట్ట బీఆర్ఎస్ అభ్యర్థి యాకాల సుమిత్రభీమయ్య 500ల తేడాతో విజయం సాధించారు. 

వెల్దండ మండలంలో 

32 పంచాయతీలలో కాంగ్రెస్ 21, బీఆర్ఎస్ 10, స్వతంత్రుడు ఒకరు గెలుపొందారు.

పోతేపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొండల్ యాదవ్ సహా 10కి 10 వార్డులు గెలుచుకుని కాంగ్రెస్‌ను షాక్‌కు గురిచేశారు.

వంగూరు మండలంలో 

27 పంచాయతీలలో కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 7, స్వతంత్రుడు ఒకరు గెలిచారు.

ఊరుకొండ మండలంలో 

16 పంచాయతీలలో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 3, స్వతంత్రుడు ఒక స్థానంలో విజయం సాధించారు.

బీఆర్ఎస్ విజేతల స్పందన

గ్రామస్తులు మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఈ విజయం మా ఒక్కరిదికాదు… గ్రామస్తులందరిదే అని మార్చాల, పోతేపల్లి బీఆర్ఎస్ సర్పంచులు తెలిపారు.

Previous Post Next Post